: రోడ్డు ప్రమాదంలో టీఆర్‌ఎస్ నేత దుర్మరణం
వేగంగా వెళ్తున్న బస్సు, కారును ఢీ కొట్టిన ఘటనలో తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఊరెల్లి లక్ష్మణ్ (58) మృతిచెందారు. ఈ ఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం ముత్యంపేట సమీపంలో జరిగింది. గత అర్ధరాత్రి లక్సెట్టిపేట నుంచి నర్సాపూర్ వస్తున్న లక్ష్మణ్ కారును ఊట్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన వెంట ఉన్న స్థానిక నేత వెంగళరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.