: అప్పుడే మొదలైన లొల్లి... ఉత్తమ్ కు సహకరించేది లేదన్న కోమటిరెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికై 24 గంటలు కూడా గడవక ముందే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసమ్మతి సెగలు తాకాయి. ఉత్తమ్ కు సహకరించేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. తమ పార్టీ అధిష్ఠానం మరోసారి తప్పుడు నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఉత్తమ్ కు పగ్గాలు అప్పగించే ముందు పార్టీ నేతలను ఒకసారి సంప్రదించి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు సహకరించనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.