: కూనలపై భారీ స్కోర్... ఐర్లాండ్ విజయ లక్ష్యం 412


అంతగా అనుభవంలేని ఐర్లాండ్ బౌలర్లను దక్షిణాఫ్రికా సింహాలు ఆటాడుకున్నాయి. కాన్ బెర్రా లో జరుగుతున్న క్రికెట్ పోటీలో టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ఆమ్లా, డుప్లెసిస్ సెంచరీలకు తోడు రుసూవ్ అర్ధ సెంచరీ కలసి భారీ స్కోర్ కు మార్గం సుగమం చేసింది. ఆమ్లా 159, డికాక్ 1, డుప్లెసిస్ 109, డివిలియర్స్ 24, మిల్లర్ 46, రుసూవ్ 61 పరుగులు చేశారు. మరికాసేపట్లో 412 పరుగుల విజయ లక్ష్యంతో ఐర్లాండ్ బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News