: ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ ప్లాంట్ కు కేసీఆర్ శంకుస్థాపన


ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ మూడో యూనిట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ మూడు సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానుందట. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News