: శతకాలతో రాణించిన ఆమ్లా, డుప్లెసిస్... 400 పరుగులపై సఫారీల నజర్!
వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు మరో భారీ స్కోర్ పై కన్నేశారు. క్రికెట్ ప్రపంచంలో పసికూనలైన ఐర్లాండ్ బౌలర్లను ఒకాట ఆడుకున్నారు. ఇప్పటికే హషిమ్ ఆమ్లా, డుప్లెసిస్ లు సెంచరీ చేశారు. ప్రస్తుతం ఆమ్లా 143 పరుగుల వద్ద కొనసాగుతుండగా, డుప్లెసిస్ 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమ్లా తర్వాత బ్యాట్ తో రెచ్చిపోయాడు. డుప్లెసిస్ అవుట్ అయిన తరువాత బరిలోకి దిగిన డివిలియర్స్ వచ్చీ రాగానే బాదుడు ప్రారంభించి 5 బంతుల్లోనే 14 పరుగులు సాధించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోర్ 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 280 పరుగులు.