: జగన్, పిచ్చి వేషాలు వేయకు... నీవెంత? ఒళ్లు దగ్గర పెట్టుకుని బతుకు: విరుచుకుపడ్డ ఉమా


వైకాపా అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీవెంత? నీ వయసెంత? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరగాడివి, పగటి వేషగాడివైన నీవు ఒళ్లు దగ్గర పెట్టుకుని బతుకు అంటూ హెచ్చరించారు. 11 కేసుల్లో జగన్ ఏ-1 ముద్దాయి అని, ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిలాంటి వారు ఆయన అనుచరులని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి జగన్ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. "మెడనొప్పి ఉందని శాసనసభలో మాట్లాడలేని జగన్... నా మెడలు వంచుతాడంట... ఆయనకు అంత సీన్ ఉందా? జగన్ దోచుకున్న డబ్బునంతా ఈడీ అటాచ్ చేస్తోంది. దీంతో, దిక్కుతోచని స్థితిలో జగన్ కొట్టుమిట్టాడుతున్నారు" అంటూ ఉమా విమర్శించారు. అతిపెద్ద ఆర్థిక నేరగాడు జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ అసాధ్యమని చెప్పిన జగన్ కు... తాము రుణమాఫీ చేసి చూపించామని చెప్పారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీల్లో ఏ ఒక్కదాన్నైనా గత పదేళ్లలో ఇచ్చారా? అని ప్రశ్నించారు. తన తండ్రి వైయస్ హయాంలో రైతులపై కాల్పులు జరిపించారని... ఆ ఘటనలో కొంతమంది రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారన్న విషయాన్ని జగన్ గుర్తుచేసుకోవాలని సూచించారు. ఓదార్పు యాత్రల పేరుతో తిరుగుతూ... మీకు అన్యాయం జరుగుతుంది, అన్యాయమైపోతారు, నాశనమైపోతారంటూ జనాలకు శాపనార్థాలు పెడుతున్నాడంటూ జగన్ పై ఉమా మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదని అన్నారు. భూసేకరణ పేరుతో వైయస్ హయాంలో వాన్ పిక్ కోసం 29 వేల ఎకరాలు లాక్కున్నారని మండిపడ్డారు. వైయస్ దత్తపుత్రుడు గాలి జనార్దన్ రెడ్డికి 14 వేల ఎకరాల భూమిని కట్టబెట్టారని విమర్శించారు.

  • Loading...

More Telugu News