: కేంద్ర మంత్రులు సుజనా, అశోక్ లు ధర్నా చేస్తారా?... అంత ధైర్యం ఉందా?
కేంద్ర సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై ఎన్డీయే మిత్రపక్షమైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు కూడా తన అసహనాన్ని మీడియా సమక్షంలో వ్యక్తీకరించారు. ఈ క్రమంలో ఈ నెల 16న కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా ధర్నా చేయాలని టీడీపీ పార్లమెంటు సభ్యులు నిర్ణయించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి, రాష్ట్రానికి నిధులను రాబట్టడమే ఈ ధర్నా లక్ష్యం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. అయితే, ఈ ధర్నాలో కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్న సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులు కూడా పాల్గొంటారా? లేదా? అనే విషయం మాత్రం తెలియరాలేదు. అయినా, ధర్నాలో పాల్గొనేంత ధైర్యం వీరికి ఉందా? అంటూ విపక్ష సభ్యులు సెటైర్లు విసురుతున్నారు.