: స్టార్ హోటళ్లలో ఇక డబ్బు తీసుకోరు!
ఐదు, ఏడు నక్షత్రాల హోటళ్లలో ఇకపై నగదు చెల్లింపులు నిలిచిపోనున్నాయి. రూం బిల్లు కట్టాలన్నా, ఫుడ్ బిల్లు చెల్లించాలన్నా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారానే కట్టాలి. స్టార్ హోటళ్లు మాత్రమే కాదు, దూర ప్రాంత విమానం టికెట్ కొనాలన్నా, లగ్జరీ కార్లు అద్దెకు తీసుకోవాలన్నా, ఖరీదైన విలాస వస్తువులు కొనాలన్నా కార్డు ద్వారానే చెల్లింపులు జరపాలి. హై వాల్యూ లావాదేవీలపై దృష్టిని సారించిన కేంద్రం నల్ల ధనాన్ని అరికట్టేందుకు ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఒక పరిధి దాటిన తరువాత చెల్లింపులన్నీ బ్యాంకు మాధ్యమంగానే జరగాలన్న నిబంధన అమలులోకి రానుంది. బ్లాక్ మనీని ఆపాలంటే నగదు లావాదేవీలు గణనీయంగా తగ్గాల్సివుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆర్థిక శాఖకు సిఫార్సులు సమర్పించిన నేపథ్యంలో నగదు లావాదేవీలకు పరిమితి పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.