: పోలీసుల దిగ్బంధంలో మంద కృష్ణ
నేడు చంద్రబాబు నాయుడు కరీంనగర్ లో పర్యటించనున్న నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు ఆటంకాలు సృష్టించవచ్చనే అంచనాలతో మంద కృష్ణ మాదిగ బస చేసిన హోటల్ చుట్టూ పోలీసులు మోహరించారు. తెలంగాణలో రెండో విడత పర్యటన నిమిత్తం ఈ ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు వైఖరి స్పష్టంగా లేదంటూ ఎంఆర్పీఎస్ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మంద కృష్ణను చుట్టుముట్టి, ఆయన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.