: చంద్రబాబుతో భేటీ అయిన ఆర్థికమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగం ఎలా ఉండాలన్న అంశాలపై వీరు చర్చిస్తున్నారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, అందరినీ తృప్తి పరిచేలా బడ్జెట్ ను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కూడా కాసేపు చర్చించినట్టు తెలుస్తోంది.