: కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన చిన్నజీయర్ స్వామి
ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో విజయం సాధించిన కేసీఆర్ ను 'తెలంగాణ పిత'గా తాము గుర్తిస్తున్నామని త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ తో కలసి పర్యటించిన ఆయన, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలన్న తపన, లక్ష్యం ముఖ్యమంత్రిలో కనిపిస్తున్నాయని పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ తన లక్ష్యాలను సాధించి తీరుతారని, అందుకు తమ అశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆశీర్వదించారు. స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వం కలసి ముందుకు సాగితే, అభివృద్ధి లక్ష్యాలు, యోగ్యతపూరితమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. గిరిజన సంస్కృతిని రక్షించేందుకు జీయర్ ట్రస్టు కృషి చేస్తుందని చెప్పారు.