: మడొన్నా 'రెబల్ హార్ట్'!
ప్రముఖ పాప్ సింగర్ మడొన్నా వరల్డ్ టూర్ కు సిద్ధం అవుతోంది. తాను స్వయంగా రూపొందించిన 'రెబల్ హార్ట్' ఆల్బమ్ ను ప్రమోట్ చేసేందుకు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ప్రపంచాన్ని చుట్టిరానుంది. ఈ టూర్ కు నిర్మాతగా లివ్ నేషన్ గ్లోబల్ టూరింగ్ డివిజన్ వ్యవహరించనుండగా, త్వరలోనే పర్యటన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మియామిలోని అమెరికన్ ఎయిర్ లైన్స్ ఎరీనాలో ఆగస్టు 29న ప్రారంభమయ్యే టూర్ ఖండాలను చుట్టిరానుంది. అమెరికాలో 25 నుంచి 30, యూరప్ లో 25 వరకూ ప్రదర్శనలు ఉంటాయని, ఆ తర్వాత ఆసియా, ఆస్ట్రేలియాలో మడొన్నా పర్యటిస్తుందని తెలుస్తోంది. కాగా, మడొన్నా కొత్త ఆల్బమ్ 'రెబల్ హార్ట్' మార్చి 10న విడుదల కానుంది.