: చిలకలగూడలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు... నలుగురు రౌడీ షీటర్ల అరెస్ట్


హైదరాబాదులోని చిలకలగూడ పరిధిలోని హమాలీ బస్తీలో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బస్తీని చుట్టుముట్టిన 450 మంది పోలీసులు ఇంటింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సోదాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఇక పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు, నలుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News