: వైద్యుల అకృత్యం...15 లక్షలు నష్టపోయిన వృద్ధ దంపతులు


ఒకప్పటి వైద్యులను చూసి వైద్యో నారాయణో హరీ అన్నారు పెద్దలు... ప్రస్తుతం కొంత మంది వైద్యులను మాత్రం జలగలతో పోల్చాలి. హైదరాబాదులో తాజాగా వెలుగు చూసిన వైద్యుల నిర్వాకం ఇలా జలగలను గుర్తు చేస్తుంది. అనారోగ్యం కారణంగా ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు వృద్ధ దంపతులు. దీనిని అలుసుగా తీసుకున్న వైద్యులు వారి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మాయమాటలు చెప్పారు. అలా భయపెట్టి వైద్యం పేరిట వారి నుంచి 15 లక్షల రూపాయలు గుంజారు. అనుమానం వచ్చిన వారు మరో ఆసుపత్రిలో పరీక్షించి చూసుకోగా, కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయని తేలింది. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్యులు రాంజి, నాగభూషణంలపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News