: ఆకట్టుకుంటున్న రుద్రమదేవి ట్రైలర్
చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి' సినిమా ట్రైలర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. తెలుగు నాట చాలా కాలానికి చారిత్రాత్మక సినిమా కావడంతో ఈ సినిమాపై అత్యంత ఆసక్తి నెలకొంది. దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర అనుష్క పోషిస్తుండగా, గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ పోషిస్తున్నాడు. ఇతర పాత్రల్లో రానా, సుమన్, నిత్యామీనన్, కేథరీన్ ట్రేసా తదితరులు నటిస్తున్నారు. కాగా, సినిమా ట్రైలర్ లో అనుష్క, బన్నీ, రానా కనిపిస్తారు. అనుష్క, బన్నీ చెప్పిన డైలాగులు, ఆహార్యం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ పై యవకులు ఆసక్తి చూపుతున్నారు. సుదీర్ఘ విరామం తరువాత వస్తున్న చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడం, 3డీ సాంకేతిక పరిజ్ఞానంలో రూపొందిన తొలి తెలుగు పౌరాణిక సినిమా కావడంతో దీనిపై ఆసక్తి రేగుతోంది. కాగా థియేటరికల్ ట్రైలర్ ను 2డీలో విడుదల చేసినట్టు సినిమా యూనిట్ తెలిపింది.