: అలసి పోయా...ఒలింపిక్స్ తరువాత రిటైరవుతా!: బాక్సర్ మేరీ కోం


'సుదీర్ఘకాలం బాక్సింగ్ ఆడి అలసిపోయా, ఒలింపిక్స్ తరువాత క్రీడకు గుడ్ బై చెబుతానని ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోం తెలిపారు. 32 ఏళ్ల వయసున్న మేరీ కోం ఇద్దరు బిడ్డల తల్లి. 2016 రియో డీ జెనీరోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆమె, ఇంత కాలం బాక్సింగ్ క్రీడలో కొనసాగడం తన అదృష్టమని పేర్కొన్నారు. బాక్సింగ్ లాంటి క్రీడను సుదీర్ఘకాలం కొనసాగించేందుకు తన వయసు కూడా అడ్డంకిగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. అందుకే తాను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని, ఒలింపిక్స్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News