: మా నాన్న యుద్ధపిపాసి కాదు...వాజ్ పేయీ విధానాలే కొనసాగాలి: మెహబూబా ముఫ్తీ
తన తండ్రి యుద్ధపిపాసి కాదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ ముఫ్తీ సయీద్ కుమర్తె, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తెలిపారు. లోక్ సభలో ఆందోళన సందర్భంగా శ్రీనగర్ లో ఆమె మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లో వాజ్ పేయి కొనసాగించిన విధానాలే కొనసాగాలని తన తండ్రి ఆకాంక్షిస్తున్నారని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలిపారు. తన తండ్రి శాంతి కాముకుడని ఆమె పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ అంశంతో పాటు అన్ని సమస్యలూ చర్చల ద్వారా పరిష్కారమవుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.