: మందు బాబులకు షాక్... తెలంగాణలో మద్యం అయిపోతోంది!
తెలంగాణలో మందుబాబులకు షాకింగ్ న్యూస్... కొద్ది రోజుల్లో మద్యం కొరత ఏర్పడనుంది. తెలంగాణలో ఎక్సైజ్ శాఖ ఆదాయపుపన్ను చెల్లించకపోవడంతో తాత్కాలికంగా మద్యం గోడౌన్లను ఐటీ శాఖ సీజ్ చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం 1468 కోట్ల రూపాయలు చెల్లించాలని ఐటీ శాఖ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు నోటీసులు జారీ చేసింది. దానికి గడువు నేటితో తీరిపోయింది. గడువు ముగిసినా బాకీ చెల్లించకపోవడంతో ఐటీ శాఖ గోడౌన్లను మూసేసింది. దీంతో తెలంగాణలోని 17 ఎక్సైజ్ డిపోల్లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఐటీ శాఖ నిర్ణయంతో మద్యం వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. వ్యాపారం సంగతి దేవుడెరుగు...మందులేనిదే ముద్ద దిగని వారి సంగతేంటని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు.