: ఏనుగు, సింహం మాంసంతో జింబాబ్వే అధ్యక్షుడి బర్త్ డే పార్టీ


జింబాబ్వేలో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది. ప్రజలు కష్టాల కడలిలో చిక్కుకుని అలమటించి పోతున్నారు. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేకు మాత్రం అదేమీ పట్టినట్టులేదు. ఆయన తన 91వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడమే అందుకు నిదర్శనం. తన బర్త్ డే పార్టీ విభిన్నంగా ఉండాలని ముగాబే తలచారు. దాంతో, ఓ రైతు సమర్పించిన 2 ఏనుగులు, సింహం, మొసలి మాంసంతో వంటకాలు తయారుచేశారు. ఈ విందు కోసం 40 ఆవులనూ తెగనరికారు. భారీ కేక్ సరేసరి. 2000 మందిని ఈ విందుకు ఆహ్వానించగా, రూ.10 కోట్లు వెచ్చించారట. దీనిపై ప్రస్తుతం జింబాబ్వేలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News