: ఏపీలో ఎంసెట్ తేదీ మార్పు... మే 8న పరీక్ష


ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ ప్రవేశపరీక్ష తేదీ మారింది. ముందుగా ప్రకటించిన మే 10కి బదులు, మే 8న పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కే సెట్, డీఎస్సీ కారణంగా తేదీ మార్పు చేయవల్సి వచ్చిందని చెప్పారు. మిగతా సెట్ ల తేదీలు యథాతథంగా ఉంటాయన్నారు. సెట్ తేదీ మారిన నేపథ్యంలో రేపు ఏపీలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఇబ్బంది కూడదనే ఎంసెట్ తేదీ మార్చామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో భేటీ ముగిసిన అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు. కాకినాడ జేఎన్ టీయూకు ఎంసెట్ నిర్వాహణ బాధ్యత అప్పగించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News