: ముఫ్తీ వ్యాఖ్యలు ఆర్మీకి అవమానం: శివసేన
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ వ్యాఖ్యలు భారత ఆర్మీకి అవమానమని శివసేన పేర్కొంది. శివసేన నేత సంజయ్ రావత్ ముంబైలో మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రే కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది మిలటరీకి అవమానమన్నారు. భారత ప్రభుత్వానికి సైన్యం శక్తిపై నమ్మకముందని ఆయన తెలిపారు. పాక్ సైన్యంతోనైనా, తీవ్రవాదులతో అయినా భారత సైనికులు పోరాడగలరని ఆయన స్పష్టం చేశారు. కాగా, పాకిస్తాన్, హురియత్ కాన్ఫరెన్స్ వల్లే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ వ్యాఖ్యానించడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.