: తల తెగినా డోంట్ కేర్... అనుకున్నది సాధిస్తా: కేసీఆర్


తనకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువని... అనుకున్నది సాధించి తీరుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు, ఢిల్లీకి వెళ్లేటప్పుడు... తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతానని చెప్పానని... చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెట్టానని గుర్తుచేశారు. కరీంనగర్ పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. పెన్షన్లకు అర్హులైన వారంతా తహశీల్దార్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. 2017 నాటికి రైతులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అందిస్తామని... 2018 నాటికి రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండవని చెప్పారు. తన తల తెగినా సరే పట్టించుకోనని... అనుకున్నది సాధిస్తానని అన్నారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని సక్సెస్ చేయడానికి పార్టీలకతీతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News