: మార్కెట్ లోకి మరో రెండు ల్యూమియా స్మార్ట్ ఫోన్లు
మొబైల్ కంపెనీలు పోటాపోటీగా స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నాయి. శామ్ సంగ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చిన రెండోరోజే మైక్రోసాఫ్ట్ నుంచి తాజాగా రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ల్యూమియా 640, ల్యూమియా 640 ఎక్స్ఎల్ పేర్లతో రెండు ఫోన్లను విపణిలోకి విడుదల చేసింది. ఇందులో ల్యూమియా 640లో... 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1.2 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 1 జీబీ రామ్ సౌకర్యాలుంటాయి. 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమేగాక, ఈ ఫోన్ కు 'వన్ డ్రైవ్' లో 15జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 1 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఇతర సౌకర్యాలున్నాయి. ల్యూమియా 640 ఎక్స్ఎల్ లో... 5.7 అంగుళాల డిస్ ప్లే, 1.2 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ను కలిగి ఉంది. అంతేగాక, 1 జీబీ రామ్, విండోస్ ఫోన్ 8.1, ల్యూమియా డెనిమ్ అప్ డేట్ ఫీచర్లు కలిగిఉన్నాయి. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్ లుక్, వన్ నోట్ లను పొందుపరిచారు. కార్ల్ జీయిస్ ఆప్టిక్స్ తో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ తదితరాలను ల్యూమియా ఎక్స్ఎల్ కలిగి ఉంటుంది.