: కివీస్ దూకుడుకు కళ్లెం వేయగలవారెవరు?
వరల్డ్ కప్ టైటిల్ రేసులో న్యూజిలాండ్ జట్టు ముందుంది. ఇప్పటికే లీగ్ దశ నుంచి క్వార్టర్ ఫైనల్ కు చేరిన కివీస్ జట్టు చిరకాల స్వప్నం సాకారం చేసుకునేందుకు మూడడుగుల దూరంలో ఉంది. క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధించి సెమీస్ చేరితే అక్కడి నుంచి ఫైనల్ బెర్తుకు చేరుకోవచ్చు. అయితే, కివీస్ కు తొలుత మూడు జట్లను అవరోధాలుగా భావించారు. కానీ, టైటిల్ రేసులో ఉన్న ఆసీస్ ను గ్రూప్ దశలోనే ఓడించగా, మిగిలింది టీమిండియా, ప్రోటీస్ (దక్షిణాఫ్రికా) మాత్రమే. లీగ్ దశలో ఆసీస్ బలంగా ప్రతిఘటించినప్పటికీ న్యూజిలాండ్ విజయం సాధించి సత్తాచాటింది. కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్, విలియమ్సన్, కోరే ఆండర్సన్, గుప్టిల్ రాణిస్తున్నారు. రాస్ టేలర్, ఇలియట్ ఫాం అందుకుంటే కివీస్ కు తిరుగులేనట్టే. బౌలర్లలో టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్ ప్రత్యర్ధుల పని పడుతున్నారు. ఒకవేళ నాకౌట్ దశలో దక్షిణాఫ్రికా, భారత్ జట్లు ఎదురైతే, ఆ రెండు జట్లను ఓడించగలిగితే కివీస్ టైటిల్ నెగ్గేందుకు అడ్డునిలిచే జట్టు మరేదీ ఉండకపోవచ్చు. క్రికెట్లో ఏదయినా సాధ్యమే.