: నిప్పుతో చెలగాటం వద్దు: చంద్రబాబుకు స్వామి అగ్నివేశ్ హెచ్చరిక
ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం అన్యాయమని విమర్శించారు. ప్రజామోదం లేకుండా ఎలాంటి కార్యక్రమం కూడా విజయవంతం కాలేదని తేల్చి చెప్పారు. బలవంతంగా రైతుల భూములను లాక్కుంటే విజయవాడలో నిరసన కార్యక్రమాలను ప్రారంభించి, దేశవ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. నిప్పుతో చెలగాటం ఆడవద్దని చంద్రబాబుకు సూచించారు. రాజధాని ప్రాంత రైతులతో చర్చించేందుకు విజయవాడ వచ్చిన సందర్భంగా, స్వామి అగ్నివేశ్ మీడియాతో మాట్లడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిని సింగపూర్ చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ, భారత్ ను భారత్ లానే ఉంచాలని... అప్పుడే మన సంస్కృతిని కాపాడుకోగలుగుతామని హితవు పలికారు.