: ప్రియాంక విషయంపై నో కామెంట్... ఎక్కడికెళ్ళాడో రాహుల్ వస్తే తెలుస్తుంది: సోనియా


ప్రియాంక కాంగ్రెస్ పార్టీలో కార్యదర్శిగా చేరనున్నారని వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించారు. నేటి ఉదయం పార్లమెంటుకు వచ్చిన సోనియాను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం గుప్పించగా, ఆమె స్పందించారు. ప్రియాంక విషయంలో తానేమీ వ్యాఖ్యానించనని తెలిపిన ఆమె, రాహుల్ గాంధీ సెలవుపై మాట్లాడుతూ, "రాహుల్ ఎక్కడకు వెళ్ళారో ఆయన వచ్చిన తరువాత మీకే తెలుస్తుంది" అనేసి వెళ్ళిపోయారు. కాగా, ప్రియాంక ఎటువంటి పదవులనూ పొందబోరని ఆమె కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News