: పొన్నాలపై పొగడ్తల వర్షం కురిపించిన ఉత్తమ్
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై నూతన అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ, సమర్థవంతంగా పరిష్కరించగలిగారని చెప్పారు. కాగా, పొన్నాల స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనికితోడు, ఇప్పటికిప్పుడు పీసీసీ అధ్యక్షుడిని ఎందుకు మార్చారో అర్థం కావడం లేదని అన్నారు. అయినా, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని... పీసీసీ అధ్యక్షుడిగా తన నియామకంపై సోనియా, రాహుల్ గాంధీ, వి.హనుమంతరావులకు కృతజ్ఞతలు తెలిపారు.