: విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి కిడ్నాప్ కలకలం... క్షేమంగా ఉన్నానంటూ ప్రకటన


విద్యాసంస్థల అధినేతగా పేరుగాంచిన కేశవరెడ్డి అపహరణకు గురయ్యారంటూ వార్తలొచ్చాయి. పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ కిడ్నాప్ కలకలం రేగింది. బనగానపల్లెకు చెందిన వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని మీడియాలో వచ్చింది. అయితే, దానిపై స్వయంగా కేశవరెడ్డి వివరణ ఇచ్చారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదని అన్నారు. బంధువుల ఇంటికి వెళుతుంటే కిడ్నాప్ అయ్యానని భావించారని వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో స్పందించిన పోలీసులు ప్రస్తుత కేశవరెడ్డి తమ వద్దే ఉన్నాడని ప్రకటించారు.

  • Loading...

More Telugu News