: రూ. 29 చెల్లించి భోజనం చేసిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం రూ. 29 చెల్లించి భోజనం చేశారు. పార్లమెంట్ క్యాంటీన్లో భోజనం రుచి చూడాలని అనుకున్న ఆయన శాకాహార భోజనాన్ని ఆరగించారు. వెజ్ తాలీలో భాగంగా పాలకూర, సలాడ్, పప్పు, మరో కూర తదితరాలను తిని భోజనం అయిందనిపించారు. మోదీతో పాటు ఇద్దరు గుజరాత్ ఎంపీలు కూడా భోజనం చేశారు. కాగా, పార్లమెంట్ సభ్యులకు అధిక సబ్సిడీతో ఇక్కడ వివిధరకాల శాకాహార, మాంసాహార భోజనం లభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోకెల్లా అతి తక్కువ ధరకు అత్యంత నాణ్యమైన ఆహార పదార్థాలు లభించే చోటుగా పార్లమెంట్ క్యాంటీన్ గుర్తింపు పొందింది. ఇక్కడ అతి ఎక్కువ ఖరీదైంది చికెన్ బిర్యానీ కాగా, దీని ధర కేవలం రూ.34 మాత్రమే.