: స్వైన్ ఫ్లూ నుంచి కోలుకుంటున్న సోనమ్ కపూర్
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్వైన్ ఫ్లూ నుంచి క్రమంగా కోలుకుంటోందని ఆమె మీడియా ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ముంబయిలోని కోకిలాబెన్ ఆసుప్రతిలో చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో "సోనమ్ పై అనధికారికంగా, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారు. ఆ అనుమానాలను తొలగించేందుకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. సోనమ్ స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్టు గుర్తించారు. సోనమ్ త్వరగా కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే తను షూటింగులో పాల్గొంటుందని ఆశిస్తున్నాం. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, పరిశ్రమ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అని పేర్కొన్నారు.