: విశాఖలో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు


రేవ్ పార్టీల సంస్కృతి క్రమంగా దేశంలోని పలు నగరాలకు విస్తరిస్తోంది. తాజాగా, విశాఖపట్నంలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ సమీపంలో ఓ గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు, దాడి చేశారు. ఆరుగురు మహిళలను, నలుగురు ఫైనాన్షియర్లను అరెస్టు చేశారు. మరో 40 మంది పరారయ్యారు. హైదరాబాదు శివార్లలో గతకొంతకాలంగా రేవ్ పార్టీలు జరుగుతుండడం తెలిసిందే. ఇప్పుడా కల్చర్ విశాఖలోనూ కనిపించడం సామాజికవేత్తలను కలవరపరుస్తోంది.

  • Loading...

More Telugu News