: ఆప్ జాతీయ కార్యదర్శిగా కేజ్రీవాల్ తొలగింపునకు రంగం సిద్ధం!


ఢిల్లీ ముఖ్యమంత్రిగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శిగా రెండు పదవుల్లో అరవింద్ కేజ్రీవాల్ కొనసాగడంపై కొందరు నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. గతవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించిన సంగతి తెలిసిందే. కేజ్రివాల్ రాజీనామాను ఉపసంహరించుకోవాలని కొందరు ఒత్తిడి తేగా, మరికొందరు మాత్రం ఆయన బదులు ఇంకొకరిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నేడు సమావేశం కానున్న ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశంలో కేజ్రీవాల్ ను తొలగించినట్టు అధికారిక ప్రకటన చేసి, కొత్త కార్యదర్శిని ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News