: 'జిహాదీ జోన్'లో పుతిన్ ఫోటో... సారీ చెప్పిన సీఎన్ఎన్
ప్రముఖ అమెరికన్ వార్తా ఛానెల్ సీఎన్ఎన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు క్షమాపణలు చెప్పింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ప్రత్యేక వార్తా కథనం 'జిహాదీ జోన్' ప్రసారం చేస్తూ, పుతిన్ ఇమేజ్ ప్రదర్శించంది. ఛానెల్ కార్యాలయంలో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. పుతిన్ చిత్రం ప్రసారం కావడం తప్పే కాబట్టి క్షమాపణలు చెప్పామని సీఎన్ఎన్ పేర్కొంది. కాగా, తమ నేత చిత్రాన్ని తప్పుగా చూపడంపై అటు రష్యాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.