: విశాఖలో ప్రధాని మోదీపై కేసు నమోదు... ఏపీని మోసగించారని ఉత్తరాంధ్ర జేఏసీ ఫిర్యాదు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోసానికి పాల్పడ్డారని ఉత్తరాంధ్ర జేఏసీ ప్రధానిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జేఏసీ నేతల ఫిర్యాదుతో విశాఖ పోలీసులు ప్రధానిపై కేసు నమోదు చేశారు. రైల్వే, జనరల్ బడ్జెట్ లలో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ మిత్రపక్షం టీడీపీ ఆందోళన బాట పట్టింది. నేటి ఉదయం తిరుపతిలోని అలిపిరిలో ధర్నాకు దిగిన టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News