: "ఈమే నా దేవత" అంటూ మనోజ్... మూడో కూతురంటూ మోహన్ బాబు


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కొడుకు మంచు మనోజ్ పెళ్లికొడుకవుతున్న సంగతి తెలిసిందే. ప్రణతి రెడ్డిని ప్రేమించిన మనోజ్... తన ప్రేమ విషయాన్ని సడన్ గా వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మార్చి 4న మనోజ్, ప్రణతిల నిశ్చితార్థం జరగబోతోంది. ఇన్ని రోజులు ప్రణతి పేరు వినడమే కానీ, ఆమె ఫొటోను మాత్రం చూడలేకపోయాం. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ ఆమె ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. ఈ సందర్భంగా, "ఈమే నా దేవత" అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఇక, "ఈమె పేరు ప్రణతి... నా చిన్న కుమారుడికి కాబోయే భార్య... ఇకపై నా మూడో కూతురు" అంటూ మోహన్ బాబు స్పందించారు.

  • Loading...

More Telugu News