: అంబేద్కర్ నామస్మరణలో ఎంఐఎం... ఇక 'జై భీమ్ - జై మీమ్'!


మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి సత్తా చాటాలని భావిస్తూ, అందుకు బలహీన వర్గాల మద్దతు ముఖ్యమని భావిస్తున్న మజ్లిస్ పార్టీ కొత్త నినాదంతో ముందుకు రానుంది. ఇక 'జై భీమ్ - జై మీమ్' నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను స్మరించుకుంటూ దళిత, బహుజన సంఘాలు ఇచ్చే 'జై భీమ్' నినాదానికి ముస్లిమిన్ అన్న భావం వచ్చే 'మీమ్'ను జోడించి 'జై భీమ్ - జై మీమ్' అనాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. నాగపూర్ లో త్వరలో దళిత సంఘాల నేతలతో కలిసి ఆయన పాల్గొనే బహిరంగ సభలో ఈ నినాదాన్ని పరిచయం చేయాలని ఎమ్ఐఎమ్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News