: నిజాయతీ చూపాడు... సీఎం నుంచి ప్రశంస అందుకున్నాడు!


ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా పోలీసు శాఖలో దొరికితే చేతినిండా సంపాదనే అన్నది జనంలో బలంగా వినిపించే అభిప్రాయం. అయితే, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నారాయణరావు మాత్రం అందుకు విరుద్ధం. ఎంతగానంటే... అడగకపోయినా డబ్బులిస్తామంటే ఏ ఒక్కరు కూడా కాదనరు. కానీ, నారాయణరావు తన విధి నిర్వహణకు ప్రభుత్వం నుంచి వస్తున్న వేతనం మినహా, ఏ ఇతర తాయిలాలను స్వీకరించరు. ‘‘మీ సేవలు మాకు సంతృప్తినిచ్చాయి... ఈ బహుమతి తీసుకోండి’’ అన్నా కూడా నారాయణరావు ససేమిరా అంటారు. జూబ్లీహిల్స్ లో ఓ పాస్ పోర్టు ఎంక్వైరీ కోసం వెళ్లిన నారాయణరావు, సదరు దరఖాస్తుదారుడు తనకు తానుగా ఇస్తున్న నగదును తిరస్కరించారు. ఈ విషయాన్ని సదరు దరఖాస్తుదారుడు నేరుగా సీఎంకు ఫోన్ చేసి మరీ చెప్పారట. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నారాయణరావును నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మరీ భుజం తట్టారు. "అందరూ నారాయణరావును ఆదర్శంగా తీసుకుని విధులు నిర్వర్తించండి" అని సీఎం ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News