: ఉద్యోగులు ఇకపై అధికారిక ఇ-మెయిల్ ఐడీ ద్వారానే ప్రభుత్వ సమాచారం పంపాలి: కేంద్రం


ప్రభుత్వ సమాచారం పంపేందుకు అధికారిక ఇ-మెయిల్స్ మాత్రమే వినియోగించాలని, ప్రైవేటు ఇ-మెయిల్స్ వాడరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగుల వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడీ నుంచి అధికారిక సమాచారాన్ని పంపడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకూ ఆజ్ఞలు వెళ్ళాయి. ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఏ (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) ద్వారానే అధికారిక సమాచారాన్ని బట్వాడా చేయాల్సి ఉంటుంది. ఇండియా సహా పలు దేశాల ఇంటర్నెట్ డేటాపై అమెరికా నిఘా పెట్టిందన్న ఎడ్వర్డ్ స్నోడెన్ హెచ్చరికల తరువాత, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం ప్రభుత్వ సర్వర్ల ద్వారానే ఇ-మెయిల్స్ పంపాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News