: పాక్ వల్లే కాశ్మీర్ లో ప్రశాంతంగా ఎన్నికలు... సీఎం ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్య


జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మరుక్షణమే పీడీపీ నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి పొరుగు దేశం పాకిస్థానే కారణమని ఆయన వ్యాఖ్యానించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. ‘‘కాశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్, ఉగ్రవాద సంస్థలు ఎన్నికల సందర్భంగా ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు. ఈ కారణంగానే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఒకవేళ ఆ సంస్థలు దాడులకు పాల్పడి ఉంటే, పరిస్థితి ఏమిటి?’’ అంటూ ఆయన ఒకింత వివాదం రేకెత్తించారు. అంతటితో ఆగని ఆయన, సరిహద్దు అవతలి వైపున్న ప్రజలు కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకున్నారంటూ పాక్ ను పరోక్షంగా ప్రస్తుతించారు. ఇదే అంశాన్ని ప్రధాని మోదీకి కూడా వివరించానని కూడా ముఫ్తీ మీడియాకు చెప్పారు.

  • Loading...

More Telugu News