: వరల్డ్ కప్ లో నేడు మ్యాచ్ ల్లేవ్!
ఫిబ్రవరి 14 నుంచి జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో నేడు విశ్రాంతి దినం. మ్యాచ్ ల తాలూకు అలసట నుంచి సేద దీరేందుకు క్రికెటర్లు ఈ సెలవు రోజును ఉపయోగించుకుంటారనడంలో సందేహం లేదు. అయితే, వరల్డ్ కప్ మజాకు అలవాటు పడిన సగటు క్రికెట్ అభిమానికి మాత్రం కాస్త నిరుత్సాహం కలిగించేదే. ఇప్పటివరకు టోర్నీలో షెడ్యూల్ ప్రకారం 23 మ్యాచ్ లు పూర్తి కాగా, వాటిలో ఒక మ్యాచ్ రద్దయింది. ఇక, కాన్ బెర్రాలో రేపు దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.