: తెలంగాణలో మళ్లీ ప్రభుత్వ సారా... 90 ఎంఎల్ రూ. 16, క్వార్టర్ రూ. 30... ప్రతిపాదనలు రెడీ!
పేదల ప్రాణాలను బలిగొంటున్న నాటుసారా, గుడుంబాను అరికట్టడంపై దృష్టిని సారించిన తెలంగాణ ప్రభుత్వం స్వయంగా సారాయి అమ్మకాలను తెరపైకి తేనుంది. ఈ మేరకు ఆబ్కారీ అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలపై ఎక్సైజ్ మంత్రి పద్మారావుతో పలు దఫాలుగా చర్చించిన అధికారులు సారా విక్రయాలకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. తుదిగా సీఎం కేసీఆర్ తో చర్చించి విధివిధానాలను ప్రకటించనున్నారు. ఎక్సైజ్ లెక్కలు మొదలయ్యే జూలై నెల నుంచి ప్రభుత్వ సారా అమ్మకాలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. మహారాష్ట్రలో దేశీదారు పేరిట ప్రభుత్వ సారా విక్రయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా, ప్రత్యేక లేబుల్ 90 మిల్లీలీటర్ల ధర రూ. 16, 180 మిల్లీ లీటర్లకు రూ. 30 ధర ఉండాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.