: పెట్టుబడుల మాంత్రికుడి వారసుడిగా భారతీయుడు?


ప్రపంచ స్టాక్ మార్కెట్ రంగంలో తనదైన ముద్రవేసి పెట్టుబడి మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న వారెన్ బఫెట్ ప్రస్తుతం తన వారసుని వేటలో తలమునకలై ఉన్నారు. సుమారు 11.5 లక్షల కోట్లకు పైగా విలువ వున్న బార్క్ షైర్ హాత్‌ వే గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా సమర్థుడైన వ్యక్తి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ పదవికి ప్రధానంగా ఇద్దరు పోటీ పడుతుండగా, వారిలో ఒకరు భారతీయుడు అజిత్ జైన్ కావడం గమనార్హం. జైన్‌ ను ఈ పదవి వరిస్తే, మైక్రోసాఫ్ట్ సంస్థకు సత్య నాదెళ్ల నియామకం తర్వాత మరో దిగ్గజ సంస్థ పగ్గాలు భారతీయుడు చేపట్టినట్లు అవుతుంది. అతి త్వరలో కొత్త చీఫ్ పేరును ప్రకటించే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News