: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా... నేడు ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు


రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాలతో పాటు విదేశాలనూ చుట్టివచ్చిన చంద్రబాబు, నేడు భారత వాణిజ్య రాజధాని ముంబై వెళ్లనున్నారు. సిటీ బ్యాంకు ఏర్పాటు చేస్తున్న పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ఏపీలోని అవకాశాలు, పెట్టుబడిదారులకు తామిస్తున్న ప్రోత్సాహకాలు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర అంశాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News