: తెలంగాణ బిడ్డవో... చంద్రబాబు చెంచావో తేల్చుకో!: ఎర్రబెల్లిపై కడియం ఫైర్


టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చీకట్లో మగ్గేలా ఇప్పటికీ కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడి పంచన చేరిన ఎర్రబెల్లి ఏ ప్రాంత బిడ్డో తేల్చుకోవాలని ఘాటుగా విమర్శించారు. వరంగల్ జిల్లా దేవరుప్పల మండలంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్న టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ స్వపరిపాలన కోసం ప్రజలు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని, క్షేత్ర స్థాయి శ్రేణులను చూసైనా ఎర్రబెల్లిలో మార్పు రావడం లేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మోచేతి నీళ్ల కోసం తహతహలాడుతున్న ఎర్రబెల్లి, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ వాటా సంగతి తెలుసుకుని... తెలంగాణ బిడ్డగా మసలుకుంటావో, లేదా చంద్రబాబు చెంచాగా కొనసాగుతావో తేల్చుకోవాలని శ్రీహరి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News