: మరోసారి ఏపీని చిన్నచూపు చూశారు: బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రం అవమానించిందని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులను అవమానిస్తే, 'అన్నీ చేస్తాం, మేమున్నాం' అంటూ చెప్పిన బీజేపీ బడ్జెట్ లో కేటాయింపులతో మరోసారి అవమానించిందని అన్నారు. తెలుగు ప్రజలు బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం మర్చిపోయిందని, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న సంగతి కూడా మర్చిపోయి, వంద కోట్ల రూపాయలు విదిల్చిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోరని ఆయన తెలిపారు.