: గోల్డ్, క్రిస్టల్స్, జెమ్స్, ఫ్లవర్స్ తో అద్భుతం లాబెల్లే!
లాబెల్లే అంటే ఏంటనుకుంటున్నారు, ఓ యాట్ (ఓడ)! సముద్ర జలాల్లో విహరించే దీనిని క్రిస్టల్స్, వివిధరకాల జెమ్స్, క్రిస్టల్స్, ఫ్లవర్స్, బంగారు తాపడంతో డిజైన్ చేస్తున్నారు. 262 అడుగుల పొడవుండే ఈ ఓడలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో 5 డెక్ లుంటాయి. వాటిల్లో మొత్తం 6 డీలక్స్ క్యాబిన్లు ఉంటాయి. వాటిల్లో 12 మంది అతిథులు సౌకర్యవంతంగా జీవితాన్ని అనుభవించవచ్చు. ప్రతి క్యాబిన్లో గుండ్రటి కటింగ్ తో రౌండ్ కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది. ప్రతి క్యాబిన్ కి ప్రైవేట్ టెర్రస్ ఉంటుంది. థింక్ కర్టెన్స్ (ఆలోచనలకు అనుగుణంగా మసలు కునే), గోల్డ్ టచప్ ఉంటుంది. హైడ్రో మసాజ్ పూల్, స్పా, స్నోరూం, ఐస్ ఫౌంటెన్స్, లైబ్రరీ, బ్యూటీ సెంటర్, డిస్కో క్లబ్, సినిమా ధియేటర్, బార్ వంటి సౌకర్యాలన్నీ ఉంటాయి. డెక్ పైకి వెళ్లాంటే లిఫ్టు ఉంటుంది. అవసరానికి వినియోగించుకునేందుకు యాట్ పై భాగంలో బంగారు రంగులో ఉన్న హెలికాప్టర్ ఉంటుంది. ప్రతి డెక్ వద్ద రిలాక్సింగ్ కోసం ప్రత్యేక సౌకర్యం ఉంటుంది. సన్ బాత్ కోసం ప్రత్యేక ప్రదేశం ఉటుంది. ఇంటీరియర్ డిజైనింగ్ ప్రత్యేక శ్రద్ధతో చేశారు. అయితే ఈ యాట్ లో ప్రయాణించాలంటే ధర ఎంతన్నది ఇంకా నిర్ణయించలేదు. కారణం ఇది కాన్సెప్ట్ దశలోనే ఉంది. మీరు వెళ్దామనుకుంటున్నారా? ఆగండాగండి...ఇందులో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం...పురుషులు నిషిద్ధం. ఈ యాట్ కేవలం మహిళల కోసం తయారు చేస్తున్నామని ఇంటీయర్ డిజైనర్ లిదియా బర్సానీ తెలిపారు. లాబెల్లే అంటే అర్థం అందమైనదని, ఓడ అందమైనది, ఓడలో ప్రయాణికులు అందమైన మహిళలు, ప్రయాణించే సముద్రం మరింత అందమైనది...మొత్తం అందాలమయం!