: తెలుగు రాష్ట్రాలను పులకింపజేసిన చిరుజల్లు
తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించాయి. వేసవి ప్రారంభానికి ముందు చిరుజల్లులు తెలుగు ప్రజలను పులకింపజేశాయి. ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలోని రాజంపేట, కలకడ, తెలంగాణలోని ముధదోల్ లో 5 సెంటీమీటర్ల వర్షం కురవగా, తాండూరు మద్నూర్ మొమిన్ పేట్, తాంగూరుల్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరిన్ని చోట్ల వర్షం కురిసింది. హైదరాబాదును జల్లులు తడిపి ముద్దచేశాయి. శీతాకాలం ముగిసిన అనంతరం ఎండలు నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో వర్షాలు కురవడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండో పంటకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.