: రాహుల్ అంటే భయపడేవాళ్లే వివాదం రేపుతారు: ఏకే ఆంటోనీ
రాహుల్ గాంధీ అంటే భయపడేవాళ్లే అనవసరమైన వివాదాలు రేపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అన్నారు. తిరువనంతపురంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేసిన రాహుల్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారని అన్నారు. రాహుల్ మరింత శక్తిమంతంగా, పార్టీని వేగంగా ముందుకు తీసుకెళ్లేలా శక్తిని సంతరించుకుని వస్తారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ విరామం తీసుకుంటున్నాడే తప్ప పార్టీని వదిలిపోలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకలాపాల నుంచి రాహుల్ తప్పుకుంటాడని ఎవరూ భ్రమపడొద్దని ఆయన సూచించారు. అలాంటి కలలు కనడం మానాలని ఆయన సూచించారు. రాహుల్, సోనియాలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.