: చేప జారిపోయింది...అతని ప్రాణం పోయింది


చేప జారిపోతే ప్రాణం ఎలా పోతుందని అనుమానం వచ్చిందా? గుంటూరు జిల్లా నగరం మండలంలోని మీసాలవారి గ్రామానికి చెందిన ఓ జాలరి సీతారామయ్య(45) పెదమట్లపూడి ఎత్తిపోతల వద్ద చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలువలో దిగి ఒక చేపను పట్టుకున్నాడు. ఇంతలో ఇంకో చేప అక్కడే తచ్చాడడంతో గుర్తించి, దానిని నోట్లో పెట్టుకున్నాడు. రెండో దానిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో నోట్లో ఉన్న చేప గొంతులోకి జారిపోయింది. దీంతో ఊపిరి అందక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీనిని గుర్తించిన స్థానికులు అతనిని పొన్నూరులోని ఆస్పత్రికి తరలించారు. చేపను వెలికి తీసేందుకు వైద్యులు అపరేషన్ చేశారు. ఇంతలో ఆయన మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News