: రేపు ముంబైకి చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ముంబై వెళ్లనున్నారు. సిటీ బ్యాంక్ ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబునాయుడు పాల్గోనున్నారు. ఈ సమావేశంలో పాల్గొంటున్న పెట్టుబడిదారులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సురక్షిత ప్రాంతమని, రాయితీలు, సౌకర్యాలు కల్పించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని ఆయన పారిశ్రామిక వేత్తలకు సూచించనున్నారు. కేంద్ర బడ్జెట్ లో తాము ఆశించిన ఎలాంటి రాయితీలు లభించని నేపథ్యంలో స్వంత క్రెడిబిలిటీపై పరిశ్రమలు రప్పించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు, పరిశ్రమల కల్పనకు ఉన్న సౌకర్యాలను ఆయన వారికి వివరించనున్నారు.

  • Loading...

More Telugu News